సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : 40 ఏళ్ల పాటు షాద్ నగర్ రాజకీయాల్లో ఎన్నో విధాల సేవలు అందించి నేడు భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నానని ప్రస్తుతం బడుగు బలహీన వర్గాల్లో బలమైన అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. అపార రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లు అందే బాబయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గంలో ఆయా పార్టీలో టికెట్ ఇవ్వకుండా రాజకీయంగా ముదిరాజులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులకు సామాజిక న్యాయం రాజకీయ చైతన్యం కల్పించాలంటే కచ్చితంగా తనకు బిజెపిలో టికెట్ వస్తుందని ఆశలు వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా అనేక పార్టీలకు సేవలు అందించానని చెప్పారు. అన్ని పార్టీలు తనను నమ్మించి ద్రోహం చేశాయని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై తనకు అపారమైన విశ్వాసం ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ ఆశీస్సులతో తనకు కచ్చితంగా టికెట్ లభిస్తుందని ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక కోటాలో తన టికెట్ కచ్చితంగా కేటాయించబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేపల్లి అశోక్ గౌడ్, చెట్ల వెంకటేష్, కురుమయ్య, ఎంకనొల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin