సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హుజూర్ నగర్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రం ముందు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేసినారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అని.. కెసిఆర్ అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించారని.. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని... కెసిఆర్ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో చేసిన మోసాన్ని ప్రజలందరూ గుర్తించారని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారని .. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని హుజూర్ నగర్ , కోదాడ నియోజకవర్గాలలో ఉత్తంకుమార్ రెడ్డి,పద్మావతి రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అయిపోయిందని.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజలకు, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఎడవల్లి వీరబాబు,జక్కుల మల్లయ్య, గొట్టముక్కల రాములు, కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, చింతలపాలెం వర్కింగ్ అధ్యక్షులు నంది రెడ్డి ఇంద్రారెడ్డి, మరియు వార్డు కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు..ముషం సత్యనారాయణ, బెల్లంకొండ గురవయ్య గౌడ్, మేళ్లచెరువు ముక్కంటి, పోతన బోయిన రామ్మూర్తి, సప్పిడి సావిత్రి,, బంటు సైదులు, కంకణాల పుల్లయ్య, బెల్లంకొండ వెంకట్ ,నారాయణ, రేపకుల కోటయ్య, తెప్పని ఎలమంద,దాసరి రాములు,దాసరి పున్నయ్య, పులి బాలకృష్ణ, కందుల వినయ్, రెడపంగు రాము, కస్తాల సైదులు, షేక్ ఉద్దండు, షేక్ ముస్తఫా, దొంతగాని జగన్, జింజిరాల సైదులు,వీరేష్ గౌడ్,మార్క్స్, కందుకూరి రాము, గడ్డము అంజి, గజ్వేల్ వెంకటేశ్వర్లు,నాయుడు మరియు అధిక సంఖ్యలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
-----------------------
Admin