Monday, 27 July 2026 02:30:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం ప్రజలకు తీరని కష్టాలు... అవకాశం ఇస్తే పోరాడుతా...

Date : 21 October 2023 04:07 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ వార్డుల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని..అవకాశం ఇస్తే పరిష్కారానికి కృషి చేస్తానని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ స్పష్టం చేశారు."మన కొత్తగూడెం..మన కామేష్" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 1వ వార్డు,2వ వార్డు,3వ వార్డుల్లో కొనసాగింది.అనంతరం పర్యటనలో తిష్టవేసి ఉన్న సమస్యలను ప్రజలనుంచి తెలుసుకొని నమోదు చేసుకున్నారు.కొత్తగూడెం మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ గా అప్డేట్ అయినప్పటికీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పెరుకపోయాయని విమర్శించారు.ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మున్సిపల్ సిబ్బంది కేవలం కౌన్సిలర్లకు మాత్రమే పనిచేస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పది సంవత్సరాలు అవుతున్న అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దారిద్రరేఖ దిగువన ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పొందే అదృష్టం లేకపోవడం దారుణమన్నారు.కేవలం కొన్ని వర్గాలకే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందజేస్తూ..నిజమైన లబ్ధిదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ దౌర్జన్యం.. ఈ దోపిడీ ఎంత కాలం కొనసాగుతుందో అర్ధంకాని పరిస్థితుల్లో ప్రజలు మార్పు దిశగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.ప్రజలు"కొత్తగూడెం" బిడ్డగా గుర్తించి ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు *గంధం మల్లికార్జున్ రావు,సాయి,శరత్,వినయ్,సోను,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :