సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుండి MLA చిట్టెం రాంమోహన్ రెడ్డి జండా ఊపి జాతీయ దినోత్సవ ర్యాలీని ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు వివిధ నాయకులతో, అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు సమాజంలో ప్రజలు వివిధ రకాల మూఢ నమ్మకాలు, సామాజిక బందీలుగా ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగం ద్వారా వారికి సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వంతో పాటు సామాజిక బంధీల నుంచి అంబేడ్కర్ విముక్తి కల్పించారన్నారు. ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలు, వేల పుస్తకాలు అధ్యయనం చేసి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించారన్నారని పేర్కొన్నారు. అటువంటి మహానీయుడికి జనవరి 26 రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ అధికారి అనిల్ గౌడ్, ఎస్సై పర్వతాలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin