సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పోలీసు స్టేషన్లో ఇకపై ఎలాంటి పైరవీలు ఉండవని అధికారులపై కూడా ఒత్తిడి ఉండదని వారికి పూర్తి స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంటుందని, అధికారులు సిబ్బంది బాధితుల పక్షాన నిలబడి న్యాయం ధర్మం పాటించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను స్థానిక ఏసిపి రంగస్వామి, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు తదితరులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేలు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన వీర్లపల్లి శంకర్ స్థానిక పోలీస్ అధికారులతో కాసేపు మాట్లాడారు. పోలీసులు న్యాయం ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్టేషన్లలో పైరవీలు ఉందొద్దని న్యాయం మాత్రమే జరగాలని సూచించారు. అధికారులపై కేసుల విషయంలో ఎవరి ఒత్తిడి ఉండదని అన్నారు. పోలీసు ఉద్యోగుల విషయంలో కూడా ఏలాంటి పైరవీలు ఉండవని ఎవరిని ఉద్దేశపూర్వకంగా మార్చడం, మళ్లీ పెట్టుకోవడం జరగదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో అండగా నిలబడాలని సూచించారు.
-----------------------
Admin