సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెర్వు మండలం కేంద్రం, మేళ్ళచెర్వు గ్రామానికి చెందిన ముస్లిం బజార్ , చెర్వు కట్ట బజార్ కాలనీ నుంచి 150 మంది రషీద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది.హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రం, హుజుర్ నగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అంటే, నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే బి ఆర్ ఎస్ పార్టీ తోనే, సాధ్యం అని వారి పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు; లాలూ, ఆటోజానీ, మదర్స, బషీర్, బాబు, రఫీ, ఫిరోజ్ ఖాన్ ,రియాజ్,యూసుఫ్ బీ, ఫర్జానా,సాబెర,సుబాని,రియనా, జేరీనా, మరియు పలువురు కార్యకర్తలు,మహిళలు, తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అందరూ ఆశీర్వదించి, వారి దయ తో నేను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత నిత్యం ప్రజల మధ్య ఉండి పని చేస్తున్నాను.. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలిసిన వాడిగా, మీకు ఏ సమస్య ఉన్న వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్న..మీకోసమే పని చేస్తాను.మళ్ళీ మనమే గెలుస్తున్నాం, మీ దయ తో గెలిచిన తర్వాత సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాను, ముస్లిం లు కూడా చాలా మంది పేదలు ఉన్నారు, ధీన స్థితిలో ఉన్నారు, వీళ్ళ అందరికీ ఏమైనా సహాయం చేయండి అని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.ప్రత్యేక నిధులు మంజూరు చేసి, చాలా గ్రామాలలో మషీద్ ల అభివృద్ధి,ఈద్గా కి, ఖాబరస్తాన్ కి,షాదీఖానలు నిర్మించినం.. మౌలిక సదుపాయాలు కల్పించి ,చాలా గ్రామాలకు 4 నుంచి 10 కోట్ల రూపాయలు పనులు చేసినం.ప్రజల సమస్యలు తెలిసిన వాడిగా నేను చెప్తున్న..మీకు ఏ సమస్య ఉన్న వాటి పరిష్కారం కోసం పని చేస్తాను.నియోజకవర్గ ప్రజలు, యూత్ సపోర్ట్ తోని ఎమ్మెల్యే కాగలిగినం..నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు అందరికి, మౌలిక సదుపాయాలు కల్పించి, తీరుతామని అన్నారు.
-----------------------
Admin