సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పుట్టపర్తి మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం మరువ బజారులో ఇదేంకర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ముసకులు పేదలపై పన్నుల భారం మోపి వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు చేసిందేమీ లేదని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా రాయితీ కింద వ్యవసాయ పరికరాలు అందజేయలేదని మండిపడ్డారు. దీనికి తోడు రైతుల నడ్డి విరిగేలా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నీ అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్ భాష , ఆరిఫ్ ఖాన్ , అఖిల, డ్రైవర్ అబ్బులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు సౌదీ నాగరాజు, హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి వైదేహి, పిట్ట ప్రభాకర్ రెడ్డి, చంద్ర, సీనా, చాంద్ బాషా, చౌడప్ప, మస్తానమ్మ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin