Sunday, 26 July 2026 11:55:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

21 న జరిగే జన సమితి పార్టీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి...

Date : 19 January 2024 12:28 PM Views : 320

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో యువజన సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి జనసమితి రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి గొంగరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో జరిగే విభజన హామీలు పైన జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి మాయమైన నియంతను గద్దెదించిన తెలంగాణ ప్రజలకు జేజేలు తెలుపుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో జనవరి 21న హైదరాబాదులోనే మోక్షంగుండ విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్న విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించడంలో విఫలం చెందిన టిఆర్ఎస్ పార్టీ, అధికారాన్ని తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించడం ద్వారా రాష్ట్రానికి రెండు పార్టీల అన్యాయం చేశాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో ఇచ్చిన హామీలైన కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తేల్చాలి. ఉద్యోగుల విభజన పూర్తి చేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపాలి అన్నారు. పెండింగ్లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలను ఆస్తులను విభజించాలి. రాష్ట్రంలో హర్టికల్చర్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి. అనే డిమాండ్లతో రాష్ట్రస్థాయి సదస్సు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్టి సదస్సుకు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని యువత, మేధావులు, జన సమితి పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ భిక్షం నాయక్, యువ జన సమితి నాయుకులు కాటిబోయిన గోపి, సురేష్, మహేష్, గోపాల్ నరేష్ , ఆకాష్ తదితరులు పాలుగోన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: