సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మండల ఆఫీసు పరిధిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వ్యతిరేక దినోత్సవం ర్యాలీ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ... జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం లో భాగంగా ఈ సంవత్సరము పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాకు ఆహారం కావాలి పొగాకు కాదు, అనే సూక్తితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పొగాకును వివిధ రకాల ప్రాడెక్టుల ద్వారా మానవులు ఉపయోగించడం వల్ల అనేక రకమైన జబ్బులకు, ప్రాణాంతకమైన వ్యాధులకు గురి అవుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని అన్నారు. అందువలన అందరూ కూడా సిగరెట్స్ తాగడం, జర్దాలు తినడం, పాన్ పరాకులు వేసుకోవడం, బీడీలు తాగడం మానేయాలని తెలిపారు. షాద్ నగర్ వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి మాట్లాడుతూ.. పొగాకు ప్రోడక్ట్లతో తయారుచేసిన బీడీలు, సిగరెట్లు, జర్దాలు, గుట్కాలు వాడటం వలన నోటి క్యాన్సర్లు, నోటి పుండ్లు ఏర్పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పారు. అందువలన ఎవ్వరు కూడా పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ వాడకూడదని నినాదాలు చేసుకుంటూ, మాకు పొగాకు కాదు ఆహారం కావాలి, అనే సూక్తితో, ప్లే కార్డ్స్ డిస్ప్లే చేస్తూ, ర్యాలీ తీయడం జరిగింది. అందరూ కూడా మంచి ఆహారము అలపాట్లు నేర్చుకొని తాజా కూరగాయలు పండ్లు, పాలు, పెరుగు ఆకుకూరలతో మంచి భోజనం తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకొని, ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటెడ్ జె శ్రీనివాసులు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఎంపీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
-----------------------
Admin