సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం 25వ వార్డులో ఘనంగా ముగ్గుల పోటీలు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని 25 వ వార్డులో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ యం.డి సాహెరా బేగం గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్ ,సెకండ్, థర్డ్ ప్రైజ్ లో ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారికి కన్సోలేషన్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు యం.డి యూసుఫ్, మోరే భాస్కర్, కొండ్ర శేఖర్, అబ్దుల్ రహమాన్, యం.డి మసూద్, రంగన్న, శివ తదితరులు పాల్గొన్నారు. వార్డు మహిళా మణులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత వార్డులోని మహిళలను ఒకచోట చేసినందుకు వార్డులోని ఆడపడుచులు కౌన్సిలర్ సాహెరా బేగం కు ధన్యవాదాలు తెలిపారు...
-----------------------
Admin