సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపల్ 2వవార్డు ప్రాంతంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యమాన్ని స్థానిక ప్రజలను కలుసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ లను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగా సీతారాములు మాట్లాడుతు సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇవ్వడమే కానీ వాటిని అమలు చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండా పోయాయని అన్నారు. నాడు వైఎస్ఆర్ హయ్యంలో ఇందిరమ్మ ఇండ్లు, భూములు, రేషన్ కార్డులు వంటివి ఎలాంటి ఆంక్షలు లేకుండా అందిస్తే నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలతో పార్టీలోకి వలస వచ్చిన వారికి, ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అందజేస్తూ, అర్హులైన లబ్ధిదారులను మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తూ పేదింటి మహిళల కష్టాలు తీరుస్తుందనీ అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకానికి మరోసారి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరిట పథకాన్ని పునరుద్ధరిస్తు ఆరు లక్షల రూపాయలతో పాటు భూములు లేని వారికి భూములు సైతం గ్రామాల్లో అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, లింగం.పిచ్చిరెడ్డి,ఆకునూరి కనకరాజు, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, బోదాసు కనకరాజు, కొల్లి సమ్మయ్య, , మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, తాండ్ర నాగబాబు,సుందర్లాల్ కోరి, సురేషు, నాగేశ్వరరావు, నాగరాజు, ఓదెలు, శేఖర్, సతీష్, పండు, నిరంజన్ రెడ్డి, ప్రసాద్, నరసింహారెడ్డి రెడ్డి, భద్రం, రవి, నరేష్, కుమార్, ఉదయ్ కుమార్, మహిళా నాయకురాలు ఉమ మరియు మహిళా జిల్లా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
-----------------------
Admin