సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై తమ అధినేత రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మేల్యేలు వక్రీకరిస్తున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ద్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ తీరుపై విరుచుకు పడ్డారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వక్రీకరించి మాట్లాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే రైతులు. రైతులు అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ మంత్రులంతా నూటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రేవంత్ మాట్లాడితే వక్రీకరిస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా? అని అన్నారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్‌లో వణుకుపుడుతోందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ ఎజెండా అని తేల్చిచెప్పారు. రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేశారు. రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ సర్కార్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని శంకర్ నిలదీశారు. విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి ఆస్తి ఎక్కడిది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చేగూర్ శివారులో ఉన్న మద్దూరు వద్ద 120 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా సంపాదించారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. ఎంత కష్టపడితే 120 ఎకరాలు సంపాదించాడని ఇంత అక్రమ ఆస్తి ఎలా వచ్చిందని శంకర్ నిలదీశారు. ఫామ్ హౌస్ నిర్మాణానికి తమ నియోజక వర్గము నుండి పెద్ద ఎత్తున మట్టిని తరలించి నిబంధనలు తుంగలో తొక్కిన విద్యుత్ శాఖ మంత్రి ఆస్తులపై ప్రత్యేక విచారణ జరపాలని శంకర్ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో జరుగుతున్న కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదిస్తున్నారని శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీరి అక్రమాలను కక్కిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, సుదర్శన్, పుల్లారెడ్డి, మహిళా నాయకురాలు నాగమణి, బీసీ సెల్ అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు మహిళా సెల్ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ అనుబద్ధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin