Sunday, 26 July 2026 01:49:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం కవి రాజేష్ కు ప్రశంసా పత్రాన్ని అందించిన నాగాలాండ్ గవర్నర్...

Date : 11 January 2024 07:07 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంతర్జాతీయ తెలుగు మహాసభలలో నాగాలాండ్ గవర్నర్  లా గణేషన్, హై కోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి  చేతుల మీదుగా కొత్తగూడెం కవి రాజేష్ ను సన్మానించారు. తెలుగు భాష గొప్పతనాన్ని.. తెలుగు భాష వైభవాన్ని రాబోయే తరాలకు అందించాలన్న గొప్ప సంకల్పంతో మాస్ట్రో డా గజల్ శ్రీనివాస్  నిర్వహణలో ఆంధ్ర సారస్వత పరిషత్ ,  చైతన విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5,6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగిన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో సాహిత్య రంగంలో కనబరుస్తున్న ప్రతిభకు గాను కొత్తగూడెం కవి రాజేష్ ను నాగాలాండ్ గవర్నర్  లా గణేషన్,  హైకోర్టు జస్టిస్  ఆకుల వెంకట శేషసాయి  ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు. తెలుగు మహాసభల సందర్భంగా మూడు రోజుల పాటు సాగిన కవి సమ్మేళనం కథా పఠనానికి రాజేష్ నిర్వాహకుడి గా వ్యవహరించారు. డా. గజల్ శ్రీనివాస్,  రసరాజు వంటి గొప్ప కవులు పాల్గొన్న గజల్ కవి సమ్మేళనంలో రాజేష్ తన గజల్ ను వినిపించి సహ గజల్ కవుల, ప్రేక్షకుల ప్రశంసలను పొందాడు. లక్ష మందికి పైగా సాహితీ ప్రియులు పాల్గొన్న మహాసభలలోని సాహితీ సదస్సులు, కవి సమ్మేళనం, కళా ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంత గొప్ప తెలుగు మహాసభలలో జిల్లా నుండి పాల్గొని సాహితీ రంగంలో ప్రతిభను కనబరచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి గుర్తింపును తీసుకువస్తున్న రాజేష్ ను జిల్లా కవులు, కళాకారులు, పురప్రముఖులు అభినందనలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :