సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : మఠంపల్లి మండలంలోని మేకపాటి గౌతం రెడ్డి ఫౌండేషన్ సహకారంతో నిరుపేదలైన 60 మందికి వృద్ధులకు రగ్గులు అందించి తన వితరణ చాట్టుకున్నారు . ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు రచయిత తాటికొండ వేణుగోపాల్ రెడ్డి తన స్వగ్రామం మఠంపల్లి మండలంలో తన తల్లిదండ్రులు పిచ్చిరెడ్డి వెంకటమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిరుపేద లకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నేను చేస్తున్న చిరు ప్రయత్నానికి కొండంత అండగా నిలిచిన మేకపాటి గౌతంరెడ్డి ఫౌండేషన్ తన దాతృత్యాన్ని చాటుకుంటున్నారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కల్పన, పాపిరెడ్డి ,జానకి, పద్మ ,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin