సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపల్ కి చెందిన కె. బాల్ రాజ్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ 7358, ఐ.టి. సెల్, సైబరాబాద్ లో తన విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందున తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవాపతకానికి ఎంపికైనారు. తాను 1998 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఎంపికై 2022 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. 11 ఏళ్ళు గ్రే హౌండ్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 14 ఏళ్ళు శాంతిభద్రతలు, ఐ.టి. సెల్ షాద్ నగర్ సైబరాబాద్ లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తనదైన శైలిలో క్రమశిక్షణతో పని చేశారు. ఇట్టి సేవాపతకంలో భాగంగా ఇరవై ఐదు వేల నగదు, ప్రశంసా పత్రం, ఘనసన్మానం లభిస్తాయి. షాదనగర్ సబ్ డివిజన్ లో సేవలందిస్తూ ఇట్టి పోలిస్ సేవా పతకం పొందినందున షాద్ నగర్ ఎసిపి కుశాల్కర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సైలు, పోలిస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
-----------------------
Admin