సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయితీ శివారులోని శ్రీ పద్మావతి దేవి శ్రీదేవి భూదేవిసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన వేంచేసియున్న. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రధాన అర్చకులు రామలింగాచారి, ముదివర్తి వెంకట నరసింహాచార్యులు, మరియు కాందూరి వెంకట నరసింహా అమోఘాచార్యులు ఆధ్వర్యంలో దేవి నవరాత్రులను ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చెడుని నాశనం చేసి మంచిని నెలకొల్పిన మాహిశా సుర మర్దిని అవతారంలో అమ్మవారిని అలంకరించి పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలను నిర్వహిస్తున్నరు ఈ పూజలలో ఆలయ కమిటీ చైర్మన్ నల్లమోతుల రవి, ప్రజలకు అందుబాటులో ఉండి పూజ కార్యక్రమాలలో పాలుపంచుకొని పూజలు జరిపిస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలకు కమిటీ సభ్యులు మొత్తం కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ నవరాత్రుల పూజా కార్యక్రమాలలో పలు గ్రామ ప్రజలు పాలుపంచుకుంటున్నారు రేపు అనగా అక్టోబర్ 24 ఉదయము నుండి మధ్యాహ్నం వరకు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు కావున పలు గ్రామ ప్రజలు అందరూ హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని కమిటీ సభ్యులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా రేపు ఆలయ పూజా కార్యక్రమాలలో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి విరాళాలు ఇవ్వవచ్చును......
-----------------------
Admin