సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : గత నెల 25వ తేదీన రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అన్నపురెడ్డిపల్లి గ్రామ శివారులో గల శివాలయం వద్ద కొంతమంది వ్యక్తులు మద్యం త్రాగి రెండు గ్రూపులుగా గొడవ పడుతున్నారని డయల్ 100 ద్వారా సమాచారం రాగా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ టి. గోపాలకృష్ణ మరియు ఎల్. సర్వేశ్వరరావు లు అట్టి గొడవ జరిగే చోటుకి వెళ్లి వారిని వెళ్ళిపొమ్మని చెప్పగా ఒక గ్రూపు లో కొంతమంది మేము లోకల్ అని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోము అని మీరేంటి మాకు చెప్పేది అని డ్యూటీలో ఉన్న పోలీసు వారిపై దురుసుగా ప్రవర్తించి కానిస్టేబుల్ ను గాయపరిచారు, సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆ గ్రూపులో ని 9 మంది వ్యక్తులపైA1. రుంజ నాగు, A2.రుంజ హరినాథ్, A3.పింగిళి సుధీర్, 4.JCL- మైనర్ బాలుడు, 5-JCL- మైనర్ బాలుడు, A6.బడుగు సాయిబాబు@ సాయి, A7. కనపర్తి శశిభూషణ్ కుమార్@సుధాకర్, A8.బలుసు నాగేంద్ర బాబు A9.తలారి అజయ్ ల పైన కేసు నమోదు చేసిన ఎస్ఐ ఎస్డి షాహినా గారు ఈరోజు వారిని అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టుకు రిమాండ్ కు పంపగా కొత్తగూడెం కోర్టు వారు వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపించినారు
-----------------------
Admin