సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాటును పరిశీలించిన మంత్రులు. ఇరిగేషన్ శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రులకు ఘన స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR. సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేసిన మంత్రులు.. పవర్ ప్లాంట్లో యూనిట్-2 ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఒక సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు అని అన్నారు.. సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయమనే నినాదంతో ముందుకు కొనసాగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇంక్లూజివ్ లో సోషల్ జస్టిస్ మా మూల సిద్ధాంతాలు దీని ప్రకారమే ఒక సంవత్సర పరిపాలన కొనసాగింది అని అన్నారు.. అదే పద్ధతిలో మరో నాలుగు సంవత్సరాల పరిపాలన కొనసాగించబోతున్నాం అన్నారు... ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడంలో భాగంగానే 800 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం సంతోషదాయకం, ఇది జిల్లా చరిత్రలో నిలబడబోతుంది అని అన్నారు.. తదనంతరం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి నీటి విడుదల చేయనున్నారు అని తెలియజేశారు.. . ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈ సంవత్సర కాలంలో ఇరిగేషన్, విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించింది అని అన్నారు..* అనంతరం రోడ్డు మార్గం ద్వారా నేరేడుచర్ల రోడ్డు నందు గల సూర్య తేజ రైస్ మిల్ ఇండస్ట్రీ నందు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
-----------------------
Admin