Monday, 27 July 2026 02:38:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అందే మోహన్... యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సురభి దివేది ఉత్తర్వులు జారీ.

Date : 21 July 2023 05:31 AM Views : 698

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు అందే మోహన్ ముదిరాజ్ ఎంపికయ్యారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సురభి దివేది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అందే మోహన్ కు పదోన్నతి అధిష్ఠానం కల్పించడం విశేషం. రాష్ట్రస్థాయిలో అందే మోహన్ యువజన కాంగ్రెస్ విభాగంలో అనేక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఎన్నో వైవిధ్య కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న అందే మోహన్ చేస్తున్న పార్టీ పనులకు మెచ్చి ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. సామాన్య స్థాయి కార్యకర్త నుండి నేడు రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎదగడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందె మోహన్ ది మొదటి నుండి రాజకీయ కుటుంబం. తన ముత్తాత వెంకన్న అదేవిధంగా అందె బాలరాజ్ ఇంకా తన తండ్రి అందరూ ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కేవలం నమ్ముకున్న సిద్ధాంతం కోసం అందే మోహన్ అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఎంతోమంది వివిధ పార్టీల నాయకులు అందేమోహన్ ను ఇతర పార్టీల్లోకి ఆహ్వానించిన ఆయన మాత్రం నిబద్దతగా ఇందిరా గాంధీ కుటుంబంపై ప్రేమతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో యువజన కాంగ్రెస్ కార్యదర్శి హోదాలో భారత్ జోడోయాత్ర దిగ్విజయవంతంగా తెలంగాణాలో పూర్తి చేశారు. యువజన కాంగ్రెస్ తరపున ఇన్చార్జిగా ఉంటూ పాదయాత్ర పూర్తయ్యే వరకు తన సేవలు అందించారు. అంతేకాదు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించినంత కాలం పర్యటనకు అండగా తోడునీడగా ఉన్నారు. స్థానికంగా వీర్లపల్లి శంకర్ ఆశీస్సులతో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. అదేవిధంగా జాతీయ, రాష్ట్ర స్థాయి యువజన కాంగ్రెస్ నేతల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతున్న అందే మోహన్ రాజకీయ పెరుగుదల పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన అందే మోహన్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :