సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం,జూన్23, సర్కార్ టివి న్యూస్ ప్రతినిధి: తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో టీపీసిసి సెక్రెటరీ కొత్తకుర్మ శివకుమార్ , మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మిల్లెట్స్ చిరుధాన్యాల టిఫిన్ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మిల్లెట్ చిరుధాన్యాల్లో ప్రతి ఒక్కరు తిని ఇంట్లో కూడా మిల్లెట్స్ తో వంట చేసుకోవాలనే ఉద్దేశంతో అలాగే చిన్న ఏజ్ లోనే అందరికీ షుగర్,బీపీ,థైరాయిడ్,ఒబిసిటీ రావడం జరుగుతున్నాయి .అలాగే చిన్న ఏజ్ లోనే హార్ట్ ఎటాక్ కూడా రావడం జరిగింది. చాలామందికి కాబట్టి ఇవన్నీటికి పరిష్కారం ఒకటే మన తినే ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకోవాలని అది చిరుధాన్యాల తోటి సాధ్యమవుతుందని ఉద్దేశంతోటి అమర్ సంకీర్తన రెడ్డి రఘు కలిసి ఫ్రీగా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య,మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు కుతుబ్ అలీ, కుంట గోపాల్ రెడ్డి,కాలనీ ప్రెసిడెంట్, లక్ష్మీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, భాస్కర్ రావు, కాలనీవాసులు, మహిళలు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin