సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక బ్రిలియంట్ విధ్యార్ధులు నవోదయ పరీక్ష లో విజయడంకా మ్రోగించారు ఈ నెల 21 ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాలు జాతీయస్థాయిలో తన ప్రతిభ పాటవాలను నిరూపించుకొని నవోదయ లో సీట్లు సాధించిన సందర్భంగా సారపాక గ్రామపంచాయతీ EO మహేష్ విద్యార్థులను మెమెంటో శాలువాలతో సత్కరించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మండలంలో ఇంత మంది విద్యార్థులను జాతీయ స్థాయి విద్యలో మొదటి స్థానంలో నిలుపు తున్నందుకు బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి ఎన్ ఆర్ కి కూడా అభినందనలు తెలియజేశారు. మన మండలంలో ఇంత మంచి స్కూలు ఉన్నందుకు గర్వపడుతున్నామని ఇకముందు కూడా నవోదయ మరియు జూనియర్ కాలేజ్ స్థాయిలో మెయిన్స్,ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి మన మండలానికి సారపాకకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం చైర్మన్ బి ఎన్ ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇకపై కూడా క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఇంతటి విజయానికి సహరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి ఎన్ ఆర్ ముఖ్య అతిథి సారపాక గ్రామ పంచాయతీ EO మహేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
-----------------------
Admin