సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి జిల్లా : కంగ్టి మండలంలోని జ్ఞాన్ వికాస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్య పరిపాలన, ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బస్వరాజ్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి ప్రజాస్వామ్య విలువలు అవగాహన అవసరమని, మంచి నాయకుడిని గుర్తించి ఓటు వేయాలని సూచించారు. అలాగే, డబ్బు కోసం ఓటు అమ్ముకోవద్దని, పోటీదారులు రాజ్యాంగబద్ధమైన అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పాఠశాలలో నిర్వహించిన విద్యార్థి ఎన్నికల్లో ఆరవ తరగతి విద్యార్థి ఎమ్. సాయిరమ్య విజయం సాధించింది. కార్యక్రమంలో కరస్పాండెంట్ బాపురెడ్డి, ఉపాధ్యాయులు ధన్ రాజ్, శంకర్, లక్ష్మణ్, ఉమాకాంత్, అంబికా, అర్చన, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin