సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కోయగూడెం ఓసి-2, ఫిట్ వన్, భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 2018 డిసెంబర్ లో తీర్పు ఇచ్చిన ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆదివాసీ గిరిజనులు, దళితులు కాబట్టే కలెక్టర్ నష్ట పరిహారం చెల్లించకుండా వివక్షతను చూపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ , భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపట్టారు, శుక్రవారం నాడు నిర్వాసితులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాని నిర్వహించారు, అనంతరం వ్యక్తిగత దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ కి అందించారు, ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరిగి మళ్ళీ రీ సర్వే చేస్తామని అనడం వల్ల కాలం గడుస్తుంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు, ఇప్పటికే స్థానిక ఎమ్మార్వో మరియు ఆర్డీవో ఎంక్వయిరీ చేసి ఎఫ్ ఆర్ సి పట్టా భూములు కోల్పోయిన వారిని పట్టా లేకుండా అనుభవంలో ఉన్న సాగుదారులని గుర్తించి గతంలో కలెక్టర్ కి రిపోర్ట్ ఇచ్చారని దానిని హైకోర్టు తీర్పును అమలు చేయడం లో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు, అదనపు కలెక్టర్ భూ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు , 2013 భూ సేకరణ చట్టంలో పేదల అనుభవంలో ఉన్న భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డైరెక్షన్ ఉందని దీనిని కావాలనే జిల్లా కలెక్టర్ అమలు చేయకుండా తొక్కిపట్టారని అన్నారు, మూడు తరాలు గా సాగులో ఉన్న ఆదివాసి గిరిజనేతర పేదలైన దళితులు బీసీ లకు గ్రామసభ తీర్మానం ఆధారంగా చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి, అటవీ హక్కుల చట్ట ప్రకారం భూమికి నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ఉన్న అధికారులు అమలు చేయకపోవడం చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది 2018 నుండి ఇప్పటివరకు పునరావాస ప్యాకేజీ డబ్బులకు బ్యాంకు వడ్డీ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరిని గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని లేనియెడల , భూములు కోల్పోయిన పేదల ప్రతిఘటనను ఎదుర్కోవాలిసి వస్తుందని హెచ్చరిస్తున్నాం,ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నర్సింహారావు,జోగ దశరథ్,చింత రమేష్,జబ్బ కన్నయ్య, వరప్రసాద్,ఎర్రమ్మ, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin