సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తెలంగాణ రాజకీయాలు ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తారని తొలుత ప్రచారం జరిగినా తాజాగా ఆ సభను ఖమ్మంకు మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనెల 18వ తేదీన సీఎం కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభకు నిర్ణయించగా ఇదే రోజు కేసీఆర్‌కు షాకిచ్చేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం గుప్పుమంటోంది. ఖమ్మం బీఆర్ఎస్‌లో గత కొంత కాలంగా అసంతృప్తి రాగాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నేతల వైఖరిపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు జిల్లా ప్రజానీకంలో గుసగుసలు... ఈ మేరకు ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని పలు అనుమానాలు తాగితేస్తున్నాయి.. ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహిస్తుండగానే అదే రోజున పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే పొంగులేటి వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఇటీవల పొంగులేటి చేస్తున్న వరుస కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని, అలాగే తనకు పదవులు లేకున్నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చగా మారాయి. అయితే ఆయన జాతీయ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారని అందులో భాగంగానే తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జనవరి 10 నుంచి మండలాల్లో పర్యటించబోతున్నారని ఆ తర్వాత 18న అమిత్ షాతో భేటీ అయి తాను ఏదైనా జాతీయ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది....
-----------------------
Admin