సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం బిఎస్సార్ రియల్ ఎస్టేట్ అడ్డా గా మారిందని... బిజెపి ఫ్లోర్ లీడర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లోని నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గృహం నందు నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్ ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి నరసింహారెడ్డి మాట్లాడుతూ. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం బి.ఆర్.యస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మారిందని .ఓపెన్ ప్లాట్ లకు మరియు అసైన్డ్ భూములకు హౌస్ నంబర్లు ఇవ్వడంలో ఆర్మూర్ మున్సిపాలిటీ అడ్డగా మారిందని. పెరికిట్లోని అసైన్డ్ భూమి 1000 గజాల స్థలాన్ని ఇంటి నంబరు 1-26/47 డాక్యుమెంట్ నెంబర్ 878/22 అక్రమంగా సృష్టించి, ఇలాంటి ఇంటి నంబర్లు సుమారు ఈ వారం రోజుల్లో 30 వరకు ఇవ్వడం జరిగిందని. ప్రస్తుతం కమిషనర్ గతంలో రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అక్రమ హౌస్ నెంబర్లు ఇవ్వడంలో అక్కడ కూడా ఇలాగే చేసేవాడని ఆర్మూర్ మున్సిపాలిటీ ఆఫీసులో ప్రస్తుతం గా ఇన్చార్జిగా కమిషనర్ గా బాధ్యతలు చేపడుతూ యాదిచ్చగా ఇష్టారాజ్యంగా గతంలో చేసిన అవినీతిలో ఉన్న అనుభవంతో ఇంటి నంబర్లు అక్రమంగా కేటాయించడంలో తన నిష్టాతనను చూపిస్తూ ఇంటి నంబర్లు ఇవ్వడం జరుగుతుందని. కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధికారపక్ష కౌన్సిలర్ల పై అదేవిధంగా , వీరికి సహకరిస్తున్న వివిధ సంబంధిత వ్యవస్థల అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారి దగ్గరుండి ఈ రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారానికి ఊతమిస్తూ ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. కమిషనర్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ అక్రమాలపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించి ప్రభుత్వ భూములను కాపాడాలని బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ మరియు ఆర్మూర్ మున్సిపాలిటీ బిజెపి కౌన్సిలర్లు తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పాత్రికేయుల సమావేశంలో బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు బిజెపి సీనియర్ నాయకులు త్యాగా ఉదయ్ ఆకుల శీను బిజెపి నిజాంబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్ గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు గుగులోత్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin