సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలం జానకినగర్ గ్రామ పంచాయితిలో (స.హ.చ. 2005) కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యములో (బట్టు అమృ నాయక్ డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ భుక్య చరణ్ కాంత్ స్టేట్ సెక్రెటరీ దోమలపల్లి గోపీ, భూక్య చంద్ర కాంత్) సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(j) (1) ప్రకారం రికార్డుల తనిఖీ చేయగా అందుబాటులో ఉన్నా రిజిస్టర్ లో సుమారు 2,10,42,431/- (రెండు కోట్లు) కు పైగా అవినీతి జరిగింది మరియు గ్రామ పంచాయితిలోని రికార్డులు పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. మేము అడిగిన పది సంవత్సరములకు గాను ఆరాకొర రిజిస్టర్ లు మాత్రమే ఇచ్చినారు, ఉన్న రికార్డులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి తన విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారు. ఈ నివేదికను పై అధికారులు (సూర్యాపేట జిల్లా కలెక్టర్, డిపిఓ యాదయ్య కి వినతి పత్రం అందజేయగా వారు స్పందించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుర్వినియోగమైన నిధులను రికవరీ చేస్తామని తెలిపారు.
-----------------------
Admin