సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన “ తెలంగాణ రాష్ట్ర బంద్ “ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు *మాజీశాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపటి బంధు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మద్దతుగా పాల్గొంటుంది.. గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్యాలో మరియు రాజకీయపరంగా అణిచివేస్తూ.. బీసీలను రాజకీయంగా వాడుకొని & కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చింది.. బీసీ విద్యార్థిని & విద్యార్థులు అందరూ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలి.. బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవు.. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు & విద్యాసంస్థలు ఈ యొక్క బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతున్నానుము..
-----------------------
Reporter