Monday, 27 July 2026 10:45:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది...

Date : 18 December 2022 04:19 PM Views : 907

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పట్టణానికి చెందిన పరసా తనుశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో నాలుగు అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లను వేలమంది ఫాలో అవ్వుతున్నారు.. ఆమె చేసే వీడియోలకు కొందరు లైక్ చేయడంతోపాటు కామెంట్లు చేసేవారు. అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది. ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఎవరైనా అబ్బాయిలు లైక్ కొడితే.. వారి నుంచి సర్వం దోచేయడం మొదలు పెట్టింది. ఈ కీలాడీ లేడీ, ఆమె ప్రియుడు మోసానికి ఎందరో బాధితులుగా మిగిలారు.. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఓ యువతి మోసాల బాటపట్టగా.. ఆమెకు ఓ యువకుడు సహకరించాడు. దీంతో ఆమె తన అందం.. అభినయంతో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను పెంచుకుంది. అలా కొందరిని టార్గెట్ చేసి.. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి భారీగా డబ్బు వసూలు చేసేది. అయితే తేలిగ్గా డబ్బు సంపాదించేయాలనే పిచ్చి ఆలోచనతో తనుశ్రీ.. పరసా శ్రీకాంత్ తో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. ఇలా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అందమైన ఫొటోస్, వీడియోలు పెట్టి.. లైకులు కొట్టిన వారిని తనుశ్రీ ట్రాప్ చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుండేంది. ఆమె వీడియోల కింద కామెంట్లు పెట్టేవారికి తిరిగి పర్సనల్ గా మెసేజ్ లు పంపించేది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం బాగోలేదంటూ 8 నెలల్లో 31లక్షల 66వేలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కృష్ణాజిల్లా చెందిన పరాస తనుశ్రీని, ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వీరిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లోని చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: