సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృధి సాధ్యమని మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బాధవత్ బాలు నాయక్ సభ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఒక్కతాటి పై నిలబడి గెలిపించాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్ అభ్యర్థులను గౌరవ శాసనసభ్యులు ఖరారు చేస్తారని ,అదే విధంగా డిసెంబర్ 5 న సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయనున్నారని సీఎం పర్యటనకు ప్రతి ఒకరు హాజరు కావాలి తెలిపారు. గ్రామాలలో పార్టీ నాయకులు , కార్యకర్తలు సమన్వయం తో ఉండి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter