సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలోని 14 వ వార్డులో మరియు 15 వ వార్డులలో శ్రీ కనక దుర్గ దేవి శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలలో భాగంగా చివరి రోజు హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. తదనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజుర్ నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ ప్రాంత వాసిగా, మన హుజూర్ నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి , సబ్బండ వర్గాల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం..అన్నారు.ప్రజలంతా ఆయురారోగ్యాలు సిరి సంపదలతో..పాడి పంటలతో ఆనందంగా వుండాలని,శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరియు దేశ, విదేశాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణకు దసరా వొక ప్రత్యేక మైన వేడుక అని అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని, విజయాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్పూర్తితో, చెడు మీద మంచి గెలిచి సాధించే విజయానికి సంకేతంగా ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు.తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా జీవించాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించాలని, సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది అన్నారు.
-----------------------
Admin