సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ బొట్టు పెట్టుడు కార్యక్రమంలో భాగంగా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తాతా మాధవి లత హాజరైనారు... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు చందా మధు, పసునూరి కృష్ణ ,చావరామారావు, పసునూరి సీతమ్మ, చావా శ్రీదేవి ,యువత బచ్చల సోమేష్, తాటికొండ అనసూయ, అలివేలు, శ్రీరాముల రమ, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగినది. మాధవి మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గడపగడపకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పూర్వ వైభవం దిశగా తీసుకువెళ్లేందుకు జ్ఞానేశ్వర్ గారి ఆదేశాను సారం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది...
-----------------------
Admin