సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు(గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారంహైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు దేశవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులుదులుపుకుంటున్నారు. కానీ ఈసారి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు వేయాలని తెలిపారు. ఎంపీ రఘువీర్ రెడ్డి కి యాదవ సంఘం నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజారామ్ రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్దగట్టు జాతరకు సౌకర్యాలు కల్పించేలా నిధులు విడుదల చేయాలని ఎంపీ గారిని కోరుతూ వినతి పత్రం సమర్పించడంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కలిసి పెద్దగట్టు జాతర కు నిధులు విడుదల చేయాలని కోరారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు..
-----------------------
Admin