సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండల కేంద్రంలో ఈరోజు వాడి వేడిగా సాగిన సర్వ సభ సమావేశం. ఈ సమావేశానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సర్వ సభ సమావేశానికి పుల్లలచెరువు మండల ఎంపీపీ కందుల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులను మండలంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అలాగే మండలంలో ప్రధానమైన సమస్య నీటి సమస్య దానిమీద వాడి వేడిగా చర్చ సాగింది. రెండవదిగా పర్మినెంట్ రేషన్ డీలర్స్ను అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు మాటలు విని మండలంలోని అధికారులు రేషన్ డీలర్ పై ఒత్తిడి చేస్తున్నారు ఇంకా వారిని రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మండలంలోని రేషన్ డీలర్స్ వెళ్లే తాడిపర్తి చంద్రశేఖర్ను కోరడం జరిగింది. మండలంలోని సర్పంచులు రేషన్ డీలర్ సమస్యను ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలోని రేషన్ డీలర్స్ అందరూ భయపడాల్సిన పనిలేదు మీరెవరు రాజీనామా చేయాల్సి పనిలేదు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు ఎవరు అధైర్యపడవద్దని మీకు నేనున్నాను అంటూ రేషన్ డీలర్లకు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల వెంకటయ్య పుల్లలచెరువు జడ్పిటిసి వాగే నాయక్, ఎమ్మార్వో , ఎంపీడీవో మండల సర్పంచులు, వార్డ్ మెంబర్స్ రేషన్ డీలర్స్ పాల్గొన్నారు...
-----------------------
Admin