సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లోని ఎమ్మార్ గార్డెన్ లో సోమవారం రోజు బక్రీద్ పండుగను సందర్భంగా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ బి సురేష్ బాబు ఆధ్వర్యంలో శాంతి మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ రావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ మతసామరస్యలకు అతీతంగా అందరూ కలిసిమెలిసిగా పండుగను నిర్వహించుకోవాలన్నారు. హిందూ ముస్లింలకు తేడా లేకుండా అందరూ వారి వారి వృత్తులలో కలిసిమెలిసిగా ఉంటున్నట్లుగా, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండునట్లుగా వాతావరణాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. శాంతి సమావేశంలో ముస్లిం సోదరులకు వారు తెలియజేస్తూ గోవధ నిషేధం కావున గోవులను బల్లి ఇవ్వకూడదు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిట్ వింత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా,కౌన్సిలర్లు రహిమాన్,ఇట్టడి నరసారెడ్డి,శాల ప్రసాద్,మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పశు సంవర్ధన వైద్యాధికారి ప్రభాకర్,న్యాయవాది గతడి ఆనంద్,బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు అనిల్, మర్కాజి కమిటీ అధ్యక్షులు, విహెచ్పి బజరంగ్దళ్ నాయకులు, గో సంరక్షక్ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ఆర్మూర్ ఎస్ఐ రాము, పోలీసులు అధికారులు,మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin