సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ పర్సనల్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఎన్నికల విభాగం పర్యవేక్షకులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఎన్ఐసి (national informatics centre) విభాగంలో జరుగుతున్న పోలింగ్ పర్సనల్ డేటాని ఎంట్రీ ప్రక్రియ చేయడం జరుగుతున్నదని చెప్పారు. బుధవారం వరకు సుమారు 2,118 మంది పోలింగ్ సిబ్బంది డేటా ఎంట్రీ చేయడం జరిగిందని, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో 1095 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ సిబ్బందితో కలిపి దాదాపు 5,300 మంది సిబ్బంది వరకు అవసరమవుతుందని చెప్పారు. డేటా ఎంట్రీ ప్రక్రియపై నివేదికలు అందచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది డేటా ఎంట్రీ ప్రక్రియను బుధవారం ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ధారా ప్రసాద్, డిటి రంగ ప్రసాద్, ఎన్ఐసి డిఐఓ సుశీల్ కుమార్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ పరిశీలించారు.
-----------------------
Admin