Sunday, 26 July 2026 01:33:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థులు పట్టుదలతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి... -కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

Date : 26 August 2023 09:41 AM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వైద్యవిద్యలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి జిల్లాకు తద్వారా మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు సాదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వైద్య విద్యార్ధులకు సూచించారు. శుక్రవారం వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులో కల్సి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్య విద్యను ఎన్నుకున్నారని అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. విద్యార్థులు డిసెక్షన్ చేస్తున్న అనాటమి ల్యాబ్ పరిశీలించారు. కళాశాల పచ్చని చెట్లుతో ఆహ్లాదకరంగా ఉండాలని, ఖాళీగా స్థలంలో విరివిగా చెట్లు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కళాశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల హాజరు వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్ రావును అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో మొత్తం 150 సీట్లున్నాయని, గత సంవత్సరం నుండి కళాశాల ప్రారంభమైందని, 149 మంది విద్యార్థులు చేరినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వీరిలో బాలురు 62, బాలికలు 87 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో 107 మంది విద్యార్థులకు మొదటి విడతలో సీట్లు కేటాయింపు జరిగినట్లు చెప్పారు. అడ్మిషన్లు జరుగుతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ కు సూచించారు. అనంతరం వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిని ఆర్ అండ్ బీ ఈఈ భీంలాను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు, ఆర్ అండ్ బీ ఈఈ భీంలా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఈ మురళి, తహసిల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :