సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్కొండ రైతు వేదికలో బాల్కొండ గ్రామానికి సంబంధించిన రైతులకు ఉద్యానవన వ్యవసాయ ఉపాధి హామీ పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఆయిల్ పాం పంట సాగుపై అవగాహన సమావేశాన్ని నిర్వహించడం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు కొరకు ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీ సన్న కారు చిన్న రైతులకు 90 శాతం రాయితీ, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై మొక్కలను మరియు డ్రిప్పును అందజేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు అంతర్ పంటల సాగు కింద రైతులకు ప్రత్యేకంగా రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వము ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకోవడానికి గుంతలు తీయడానికి నీరు పోసి కాపాడుకునే దానికి ఉపాధి హామీ ద్వారా మొక్కకు ఆర్థిక సహాయం చేస్తుందని ఏపీవో ఇందిర గారు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి రోహిత్ మాట్లాడుతూ పామాయిల్ పంట సాగు తో ఎకరానికి నికరంగా లక్ష రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి పొందవచ్చని తెలిపారు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పీఎం కిసాన్ ఈ కేవైసీ ద్వారా నగదు పొందుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూసా సునీత నరహరి, లింగాగౌడ్, గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ అన్న పోశెట్టి, సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి బాలరాజు, ఏఈఓ కృష్ణవేణి, గ్రామ సెక్రెటరీ నరసయ్య, రైతులు పాల్గొన్నారు....
-----------------------
Admin