సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందులను వెంటనే ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా సభ్యులు సయ్యద్ రణమియా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్మిక బిడ్డలు,స్వీపర్లు, బిల్ కలెక్టర్లు, కారో బార్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్లు వారిని వెంటనేపర్మినెంట్ చేయాలని, స్వీపర్లకు కనీస వేతనం 15500/- కారో బార్లు, ఎలక్ట్రిషన్లు డ్రైవర్లు బిల్ కలెక్టర్ లకు కనీస వేతనం19500/- చెల్లించాలని జీవో 51 సవరించాలని పని విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగస్తులకు ప్రమాద ప్రమాద భీమ 10 లక్షలు ఇవ్వాలని , 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని , పిఎఫ్, ఈ ఎస్ ఐ గ్రాట్యూటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని , అక్రమ తొలగింపులు, కార్మికులపై వేధింపులను అరికట్టాలని , సుమారు 17 డిమాండ్ల పై వారు చేస్తున్న పోరాటానికి , సిఐటియు కార్మిక సంఘం, గ్రామపంచాయతీ సిబ్బందులు తలపెట్టిన సమ్మె విజయవంతం అయ్యేంతవరకు అన్నివేళలా అండగా ఉంటుందని, వారి వెంట ఉండి వారికి అన్ని విధాల సహసకర అందిస్తూ పోరాటంలో ముందు ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామపంచాయతీ కార్మిక అధ్యక్షులు ఇంటి రవి, ఉపాధ్యక్షులు మోతిలాల్, ప్రధాన కార్యదర్శి మంగళ పల్లి మైసయ్య, మేడి దేవదానం, గురువా రెడ్డి, వెంకటయ్య, బొందయ్య ,దావీదు సంతోషం, కోటేశ్వరి, సైదా ,వీరస్వామి బాలాజీ, నరసింహారెడ్డి ,బి వెంకటేశ్వర్లు, నాగయ్య ,నాగలక్ష్మి ,పాండు ,మీసాల నాగబాబు ,అమిద్ ,అంజి, బరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin