Monday, 27 July 2026 12:46:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్...

Date : 04 February 2023 03:25 AM Views : 668

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కారేపల్లి: అధునిక సౌకర్యాన్ని జోడించి పునరుద్ధరించబడిన కారేపల్లి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ (సిఐ) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ శుక్ర వారం ప్రారంభించారు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పాత కార్యాలయం ఇటీవల శిధిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. అదేవిధంగా కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్‌ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ప్రజావసరాలకు అనుగుణంగా పోలీస్ కార్యాలయ భావనాలను తీర్చిదిద్దుతూ. పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం నేనుసైతం, కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఖమ్మం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని, ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చి. ప్రజల రక్షణగా ఉండాలనే లక్ష్యంతో టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకురావడం సంకల్ప లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. 24 గంటలు నిర్విరామంగా పనిచేసే ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. మీ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు, గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో సహకరిస్తాయని అన్నారు. నేరస్ధులు కూడా కొత్త తరహా పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, సిఐ ఆరీఫ్ ఆలీ ఖాన్, ఎస్సై పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :