Monday, 27 July 2026 06:30:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చేవెళ్ల ఎస్సీ ,ఎస్టీ డిక్లరేషన్ చారిత్రాత్మకం... - టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 29 August 2023 07:45 AM Views : 369

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చారిత్రాత్మకమనీ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలపై తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప విషయమని పేద బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందనడానికి ఈ డిక్లరేషన్ ఉదాహరణ అన్నారు. దేశంలోని అణగారిన వర్గాలకు హక్కులతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇస్తే సీఎం కేసీఆర్ కుటుంబం వాటిని లాక్కునే కార్యక్రమం మొదలుపెట్టిందని విమర్శించారు. పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రకటించి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే మాత్రమే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ ద్వారా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు, పోడు భూములకు పట్టాలివ్వడం, ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు, కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏల ఏర్పాటు, 10వ తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10వేల ఆర్థిక చేయూత, ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు, డిగ్రీ, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పించడం, ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచి, ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకుంటామని, సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయింపు చేస్తామన్నారు. వర్గ విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు, కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హావ నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ పిల్లల భవిష్యత్ మారుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని సీతారాములు అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: