సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో "తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు" ఏర్పాటు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ బోర్డు అంశాన్ని వారి మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ (అమరుల ప్రాంగణం) వద్ద స్థానిక TUF (తెలంగాణ ఉద్యమకారుల ఫోరం) ఆధ్వర్యంలో "తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవ శాంతిదీక్ష" కార్యక్రమం లో పాల్గొని పూల దండలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు K .V. రంగా కిరణ్ ప్రసంగిస్తూ ఏవైతే ఆశయాల కోసం పోరాడారో వాటి ఫలాలు అందకపోవడం చాలా అసంతృప్తిగా ఉన్నట్టి విషయాని తెలియజేశారు అనేక ఇబ్బందులు ఎదుర్కొని తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారుల జీవితాలు అన్ని అట్టడుగు స్థానానికి దిగజారి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి అనేక సందర్భాలు చూస్తున్నాం ఉద్యమకారులు ఆర్థికంగా మరియు సామాజికంగా ముందుకు వెళ్లలేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు భవిష్యత్తులో మీకు భారతీయ జనతా పార్టీతో నేను అండదండలుగా ఉండడానికి నా శక్తివంచన లేకుండా నేను ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కె.వి రంగా కిరణ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లారపు శ్రీనివాసరావు జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి,TUF జిల్లా కన్వీనర్ మంజూర్ అలీ గూడెల్లి యాక్కయ్య, తెలంగాణ క్రాంతి బొల్లం భాస్కర్ విక్టోరియా కనక లక్ష్మి నిర్మల సమీరా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin