సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం శివాని పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారి ఆహ్వానం మేరకు బతుకమ్మ పండుగ సంబరాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగశుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గురువులను గౌరవిస్తూ ఉన్నతమైన స్థానంలో విద్యార్థులు అందరూ ఉండాలని అన్నారు,విద్యార్థి దశ నుండే సేవా భావంతో ఉండాలని కోరారు .మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పవిత్రంగా భావించే పండుగ బతుకమ్మ పండుగ, ఈ పండుగ సందర్భంగా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.మన ప్రకృతిని పూజిస్తు జరుపుకునే పండుగ…ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన మన సంస్కృతి ,సంప్రదాయాలు ప్రతి విద్యార్థికి అర్ధం అయ్యేలా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,అచ్చ దయాకర్,తాళ్లపెల్లి రాము,కొంకిస విఘ్నేష్,జూలూరి మనీష్ ,ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు,ఎద్దు కృష్ణంరాజ్,బానోత్ రాజేందర్,బానోత్ హర్షవర్ధన్ మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter