Monday, 27 July 2026 07:33:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యావేత్త పద్మ విభూషణ్ భారతరత్న అవార్డు గ్రహీత శ్రీమతి అరుణ అసఫ్ అలీ 114 వ జయంతి వేడుకలు...

Date : 17 July 2023 07:00 AM Views : 424

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కాలేజీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు మొహమ్మద్ ఖలేద్అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మహమ్మద్ ఖలేద్ అహ్మద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు ముచ్చమటలు పట్టించిన వీరోధాత్త మహిళ నాయకురాలు దేశభక్తురాలు అరుణ అసఫ్ అలీ అన్నారు పద్మ విభూషణ్ భారతరత్న అవార్డులను పొంది మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప దేశభక్త నాయకులతో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో వివిధ రూపాల్లో అనేక సేవలు అందించారని ప్రతి ఒక్కరూ భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన వారి చరిత్రలను మరిచిపోవద్దని వారిస్ఫూర్తిని, సేవలను కొనియాడాలని అన్నారు .నేటి యువతరం స్వాతంత్ర్య సమరయోధమహనీయుల త్యాగ చరిత్రలను తప్పనిసరిగా తెలుసుకోవాలనిఅన్నారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ మున్సిపల్ 25 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అస్మా నసీర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమానికి మహిళా నాయకురాలిగా పనిచేసిన గొప్ప దేశ భక్తురాలు అరుణఆసఫ్ అలీ అన్నారు. మహిళలు మహిళా విద్యార్థులు అరుణ ఆసఫ్ అలీ జీవిత చరిత్రను చదివి జీవితంలో పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు.ఉస్మానియా మజీద్ కమిటీ మాజీ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ గొప్ప మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు అరుణ ఆసఫ్ అలీ జీవితం ఆదర్శప్రాయమైనదని ఆమె కొనసాగించిన స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ దేశసేవ చేయాలని అన్నారు. ఈద్గా కమిటీ చైర్మన్ ఎండి నసీర్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని స్వాతంత్ర పోరాటంలో కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని వచ్చిన మహనీయులలో ఒకరు అరుణ ఆసఫ్ అలీ అన్నారు ఆమె సేవలు మరువరానివి అన్నారు.మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండి రెహనా మాట్లాడుతూ విద్యార్థులు,విద్యార్థినులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తులో రాణించాలని స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్క విద్యార్థి ,విద్యార్థినిలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.అంతకుముందు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలోని విద్యార్థినులకు అందరికీ స్వీట్లు మరియు అరుణ అసఫ్ అలీ జీవిత చరిత్రను తెలియజేసే పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ పాషా ,రిజ్వాన్ ,యూనిస్ మౌలానా ,రహీం ,మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు కళ్యాణి ,హారిత, మోమిన్ మైనార్టీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.తదనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :