సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే వారికి బీఎస్పీ పార్టీ బీఫామ్ ఇస్తుందని పార్టీ రాజ్యసభ సభ్యులు,నేషనల్ కో-ఆర్డినేటర్ రంజీ గౌతమ్,రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లు స్పష్టం చేశారు.మంగళవారం హైదరాబాదులో వారు కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా కామేష్ పేరును ప్రకటించారు.తెలంగాణ వ్యాప్తంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.బహిరంగ,అంతర్గత సర్వేలలో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది అన్నారు.న్యాయవాది,యువకుడు,స్థానిక సమస్యలపై అలుపెరుగని పోరాటలు చేస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇస్తున్నట్లు వారు తెలిపారు.జనరల్ అసెంబ్లీ స్థానంలో అగ్రవర్ణ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పార్టీని బలోపేతం చేయడంలో కామేష్ చేసిన కృషి వెలకట్టలేనిదనీ అన్నారు.కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంపై అధిష్టానం పెట్టుకున్న ఆశల కంటే రెట్టించిన ఉత్సాహంతో కామేష్ ముందుకు వెళుతున్నారని అన్నారు.పార్టీ సభ్యత్వాలు,బూత్ కమిటీ సమావేశాలు,నియోజకవర్గాల్లో పర్యటనలు,ప్రజా సమస్యలు ఇలా ప్రతి అంశంలో అందరికంటే ముందుండి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.అండ బలం,ఆర్థికబలం, అగ్రవర్ణ ఆదిపత్యం ఒక దిక్కు బీసీ,దళిత,గిరిజన,మైనార్టీ,బహుజన వర్గాల ఆశాజ్యోతిగా కామేష్ ఇంకో దిక్కు నిల్చున్నారని అన్నారు.ప్రజలు న్యాయం వైపు నిల్చోని భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు,వారు ఎదుర్కొనే సమస్యలకు దూరంగా ఉండే వారిని ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రజలు కూడా దూరం పెట్టాలని సూచించారు. కామేష్ ను కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల గంధం మల్లికార్జున్ రావు,సాయి,శరత్,వినయ్,సోను లు అభినందనలు తెలిపారు
-----------------------
Admin