Sunday, 26 July 2026 09:53:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూనియర్ రాష్ట్రస్థాయి రగ్బీ విజేతలు సూర్యాపేట, నల్గొండ...

Date : 02 June 2023 06:53 AM Views : 414

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని బ్రదర్ స్కూల్స్ గ్రౌండ్ ఆవరణలో జరిగిన జూనియర్స్ రాష్ట్ర పోటీల్లో బాలికలు విభాగం లో హోరాహోరిగా జరిగిన ఫైనల్ పోటీలో సూర్యాపేట వర్సెస్ నల్గొండ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో నిర్ణీత సమయంలో రెండు జట్లు 5-5 స్కోర్ తో సమానంగా నిలవగా ఎక్స్ట్రా ఐదు నిమిషాల సమయంలో మళ్లీ రెండు జట్లు ఏమి స్కోర్ చేయకుండా మ్యాచ్ డ్రా కాగా టాస్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టాస్ వేయగా అదృష్టం సూర్యాపేటను వరించి విజేతగా నిలిపింది. నలగొండ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో హైదరాబాద్ వరంగల్ జడ్ల మధ్య జరగగా హైదరాబాద్ విజేతగా నిలిచింది.బాలుర విభాగంలో ఫైనల్ పోటీ నల్గొండ మేడ్చల్ మధ్య జరగగా నల్గొండ 12 -0 తో నల్గొండ విజేతగా నిలవగా మేడ్చల్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో సూర్యాపేట వర్సెస్ నిజాంబాద్ మధ్య జరిగిన పోటీలో రెండు జట్లు నిర్ణీత సమయాల్లో సమఉజ్జిగా పోటీ పడగా రెండు జట్లు మూడో స్థానం నిలిచాయి. టోర్నమెంట్లో 15 జిల్లాల నుండి 21 జట్లు పాల్గొనగా అందులో 15 బాలుర జట్లు, ఆరు బాలికల జట్లు పాల్గొ న్నాయి. వీరి నుండి అత్యంత ప్రతిభ కలిగిన 12 మంది బాలురను, 12 మంది బాలికలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన వారిలో బాలికల విభాగంలో మహేశ్వరి, శ్రీవిద్య, రాజశ్రీ, శిరీష, అరుణ, దివ్య, అఖిల, సోనీ, చందన, స్పందన, లహరిక, చందన. బాలుర విభాగంలో మధు, సాయి, శ్రీకాంత్, అశోక్, వాసు, రాఘవేంద్ర, గోపాల్, అనిల్, ప్రణయ్, విగ్నేష్, గణేష్ ఎంపికైనారు. వీరు ఈనెల 4, 5, 6 తేదీలలో మహారాష్ట్రలోని పూణేలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుణ్ రెడ్డి, సెలక్షన్ కమిటీ చైర్మన్ గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా రబ్బీ చైర్మన్ మన్నెం శ్రీనివాసరెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ నోయల్ , టోర్నమెంట్ ఆర్గనైజర్ కర్నాటి తరుణ్ రెడ్డి,సెలక్షన్ కమిటీ చైర్మన్ కరణం గణేష్ రవి కుమార్, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ తిరుపతయ్య చౌదరి జిల్లా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన్నెం సీతారామి రెడ్డి,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పెండిపోలు రామచంద్రయ్య మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి మట్టపల్లి దేవస్థాన ట్రస్టు సభ్యులు మన్యం శశి రెడ్డి గ్రామ కో ఆప్షన్ సభ్యులు సురేష్ సీనియర్ క్రీడాకారులు గుర్రం రామ్ రెడ్డి , దొంతి రెడ్డి నర్సిరెడ్డి హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతల వెంకటేశ్వర్లు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రెఫరీలు శ్రీకాంత్, మహేష్, రాజేష్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :