Monday, 27 July 2026 06:38:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం...

Date : 28 October 2022 12:19 AM Views : 275

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : వైసీపీది అరాచక పాలన టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డిని గెలిపించి జగన్ కు షాక్ ఇవ్వాలి. ""అతి త్వరలో పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన "" రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతోందని మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ఓడి చెరువు మండలంలోని లింగాలపల్లి, గొల్లవారి పల్లి, బలిజ పల్లి, తంగేడు కుంట ,మద్దక వారిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ , రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని దానికి స్వస్తి పలకాలంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు పశ్చిమ రాయలసీమ పట్టబద్దుల అభ్యర్థి పులివెందుల చెందిన రామ్ గోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు . పుట్టపర్తి నియోజకవర్గం లో అతి త్వరలో టిడిపి అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు భవిష్యత్తులో టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లింగాలపల్లి లో మృతి చెందిన భజంత్రీ వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణి పద్మావతి ని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు అదేవిధంగా మద్దక వారి పల్లి లో మృతి చెందిన వెంకట లక్ష్మమ్మ కుటుంబాన్ని పరామర్శించారు .వారికి మనోధైర్యాన్ని కల్పించి వారికి ఆర్థిక సాయం అందజేశారు.టీడీపీ సభ్యత్వం బాగా చేసిన మాజీ కన్వీనర్ రాజారెడ్డి ని మాజీమంత్రి అభినందించారు అలాగే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుని ప్రమాద బీమా పొందాలని కోరారు టిడిపి సభ్యత్వ నమోదులో పుట్టపర్తి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని టిడిపి నాయకులకు సూచించారు. బలిజపల్లి తంగేడిగుంట గ్రామాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి తో పాటు మండల కన్వీనర్ జయచంద్ర మాజీ కన్వీనర్ రాజారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్ ఫీట్ల నాగరాజు టిడిపి నాయకులు జాకీర్ హుస్సేన్,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు,టీడీపీ సీనియర్ నాయకులు ఎల్ ఐ సి నరసింహులు , టైలర్ షబ్బీర్,మల్లేశ్వరి ,అబ్ల్యూ హుసేన్ టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :