Sunday, 26 July 2026 11:25:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెనుకొండ లో కార్మిక చైతన్య యాత్ర...

Date : 28 December 2022 11:36 PM Views : 612

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కార్మిక చైతన్య యాత్ర శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ప్రారంభమై పెనుకొండ లో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీతో వచ్చి అంబేద్కర్ సర్కిల్లో సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ.. దేశంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కార్మిక చట్టాలను విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టిందన్నారు. గఫూర్ తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వరూప రాణి, రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు. రాష్ట్ర కమిటీ సభ్యులు నూర్ మహమ్మద్, ఓబుల . మాట్లాడుతూ.... కార్మిక చట్టాలను విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టిన ప్రభుత్వాలు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. విశాఖ ఉక్కు ఆంధ్రులకే హక్కు పై సమస్యలు పరిష్కారం కోసం మార్చిలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం ఏప్రిల్ 5న చలో ఢిల్లీలో పార్లమెంటును దిగ్బంధం చేయడానికి ఉద్యోగ, కార్మికులందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోట్లాదిమంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ లేబర్ కోడ్ తీసుకురావాలని చూస్తున్నాయని దీనిని వెంటనే రద్దు చేయకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భీమవరంలో జరిగే సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లో కార్మిక చైతన్య యాత్ర ప్రారంభమై పెనుకొండ కు చేరిందన్నారు. ఇక్కడ నుంచి అనంతపురం తాడపత్రి రాత్రికి ఎర్రగుంట్లకు చేరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జి హుజూర్ అంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలను బిజెపి పాలిత రాష్ట్రాలు అమలు చేయకపోయినా నేను అమలు చేస్తానంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా, కార్మిక వర్గంపై దాడులు చేయడమే కాకుండా కోట్లాదిమంది కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న 45 కార్మిక చట్టాలను సైతం కాలరాశి, 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి బడా బాబులకు, పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. దేశంలోనూ... రాష్ట్రంలోనూ... బ్రిటిష్ పాలన కన్నా హీనంగా ఉందన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి కార్మికుల రక్తాన్ని పీల్చుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ ప్రైవేటు చేస్తాం లేదా మూసివేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రులు ఉద్యమించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు దేశభక్తి పేరుతో దేశ భజన చేస్తున్న బిజెపి ప్రభుత్వం విదేశీ కంపెనీలకు అమ్మడానికి సిద్ధమైందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తున్నదన్నారు. విశాఖ ఉక్కు తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అన్ని సంస్థలను కేంద్రంలో ఉన్న మతతత్వ ప్రభుత్వం ప్రవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టిందన్నారు. కేంద్రం తరహా లోని రాష్ట్రం గంగవరం, కృష్ణపట్నం పోర్టులతో పాటు రూ.25 వేలకోట్ల విద్యుత్ జెన్ కో ను ఆ దానికి అప్పగించడానికి రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించారన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న భూములను సైతం ఆ దానికి అప్పగించి ఆంధ్ర ప్రదేశ్ ను ఆదాని ప్రదేశ్ గా కేంద్ర రాష్ట్రాలు మారుస్తున్నాయన్నారు. వీటితోపాటు ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులందరికీ కనీస వేతనాలు నెలకు రూ. 26 వీలు అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి బోనస్, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ చెల్లించాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపి కడప ఉక్కు పరిశ్రమ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో చెప్పిన విధంగా స్కీం వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించి, సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే రద్దు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్యకలాపాలు పునరుద్దించాలన్నారు. హమాలి ఆటో ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఆదుకోవాలని అన్నారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్నమేంట్ చేయాలన్నారు. విశాఖ స్టీల్ తో పాటు పోర్టులు రైళ్లు విద్యుత్ రంగాలను అమ్మడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామన్నారు. వీటితోపాటు కార్మిక సమస్యల పైన రాష్ట్ర మహాసభలో సమగ్రంగా చర్చించి ఉద్యమ రూపకల్పన చేస్తామన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యల పైన మార్చిలో చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టి కార్మిక శక్తి ఏమిటి అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కి చూపిస్తామన్నారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రంలో ఉండే మోదీ ప్రభుత్వానికి కార్మిక పోరాట శక్తి ఏమిటన్నది చూపిస్తామన్నారు. ఈ ఉద్యమాల కోసం కేంద్రం తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతన్నలు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో కార్మిక లోకం ఉద్యమించాలన్నారు. భీమవరంలో జరిగే రాష్ట్ర మహాసభలకు జాతీయ నాయకులతో పాటు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ ఇతర రాష్ట్రాల నాయకులు పాల్గొంటారన్నారు. భీమవరంలో 2వ తేదీన జరిగే కార్మిక మహా ప్రదర్శనకు వేలాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్, శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి.జిల్లా కార్యదర్శి రమేష్, లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి బాబావాలి అధ్యక్షులు బావమ్మ అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి శ్రీదేవి ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు త్రివేణి. సివిల్ సప్లై అమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు. మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు చిన్న వెంకటేష్. ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి బాబావలి, రఫీ, రామకృష్ణ. స్థానిక నాయకులు సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :