సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అనపరెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామంలో నివసిస్తున్న అతి బీద కుటుంబం అయినా తాటి నీలిమ కుటుంబ పరిస్థితిని చూసి చలించిన ఎస్ హెచ్ ఓ షాహినా తన మానవత్వాన్ని చాటుకున్నారు. తొట్టి పంపు గ్రామ సందర్శన నిమిత్తం వెళ్లిన ఎస్సై షాహినా ఆ గ్రామంలో తాటి నీలిమ భర్త మరియు చిన్న పిల్లలతో కలిసి కరెంటు లేకుండా చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటూ అవస్థలు పడుతూ ఉండగా చూసి చెల్లించి సహృదయంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారికి కరెంటు మీటర్ ఏర్పాటు చేయించినారు అంతేకాకుండా ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా వారికి అభిమానంతో అందజేయడం జరిగింది. ఇందుకుగాను ఎస్ఐ షాహినాను ఆ గ్రామ ప్రజలు ఎంతగానో అభినందించారు.
-----------------------
Admin