సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఉరవకొండ పోలీసు స్టేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన చేయాలన్నారు. క్రైం అగనెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీల నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. గ్రామాల్లో సిసి కెమేరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో మమేకమయ్యేలా పోలీసుల పని తీరు ఉండాలని సూచించారు. గ్రామ పోలీసులను సమన్వయం చేసుకుని నేరాలు తీవ్రం కాకుండా మొగ్గ దశలోనే అణచి వేయాలన్నారు. ** బూదగవి గ్రామ సచివాలయాన్ని సందర్శించిన అనంతపురం జిల్లా ఎస్పీ... అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామ సచివాలయాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఈరోజు సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి దైనందిన విధులు, ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల సేవలను ప్రజలకు సకాలంలో అందేలా పని చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు ఉరవకొండ యు.పి.ఎస్ సి.ఐ హరినాథ్ , తదితరులు వెళ్లారు.
-----------------------
Admin