సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్లగొండ కలెక్టరేట్ ఆవరణలో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో టీయూడబ్ల్యూజే( ఐజేయు ) అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి భూమి పట్టాలు అందజేశారని ఇక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పై దృష్టి పెడుతున్నారని, ఈ మేరకు ఇప్పటికే నల్గొండ జర్నలిస్టులకు ఫ్లాట్ల అంశాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ విధి విధానాలు రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలియజేశారు. గతంలో 59 జీవో అడ్డుపెట్టుకొని తప్పుడు నివాస పత్రాలు, నకిలీ బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్ కి మరియు జిల్లా ఎస్పీ కి, మరియు గుమ్మల మోహన్ రెడ్డి నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కి వినతిపత్రం అందజేశారు . వారు ఈ విషయములను రెండు రోజులలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టి యుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి,, దోసపాటి సత్యనారాయణ సూర్య బ్యూరో, కిరణ్ రెడ్డి ఐ న్యూస్, అశోక్ రెడ్డి టీవీ5, చంద్రశేఖర్ రెడ్డి 10టీవీ, సీవీఆర్ రాము, మాధురి యాదగిరి,పంచలింగం, గోలి విజయ్ కుమార్, మల్లేష్ యాదవ్,జుబేర్ హైమద్, అతిక్ హైమత్, అంజత్ ఖాన్, దోటి శ్రీను,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కెమెరామెన్స్ శంకర్,వెంకట్ చిలుముల నరేందర్ సూర్య స్టాప్ ఫోటోగ్రాఫర్, ఎస్ఎండిఏ జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ , వెనమల రమేష్ బాబు, అశోక్ నరసింహ స్వామి, జాజాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin